Friday, April 8, 2016

sunstroke : వడ దెబ్బ : ఎండా కాలం లో విపరీతమైన ఎండ తగలడం వల...

sunstroke :



వడ దెబ్బ : ఎండా కాలం లో విపరీతమైన ఎండ తగలడం వల...
: వడ దెబ్బ : ఎండా కాలం లో విపరీతమైన ఎండ తగలడం వలన జ్వరము /తలనొప్పి /వాంతులు /విరేచనములు కలిగి విపరీతమైన నీరసముకు గురి ఐతే దానిని వడదెబ...




వడదెబ్బ : ఎండా కాలం లో విపరీతమైన ఎండ తగలడం వలన జ్వరము /తలనొప్పి /వాంతులు /విరేచనములు కలిగి విపరీతమైన నీరసముకు గురి ఐతే దానిని వడదెబ్బ లేదా ఎండదెబ్బ అంటారు . 
ఇది ప్రాణాంతకము . కాబట్టి వెంటనే చికిత్స అవసరము . 
నివారణ కూడా సాధ్యం కాబట్టి ముందుగ జాగ్రత్త గ వుండటం కూడా మంచిది 

హోమియో మందులలో వున్నా అత్యద్బుతమైన ఔషధం -
 Natrum . mur . 3x   ఈ ఔషధం చికిత్స కు నివారణకు కూడా ఉపయోగ పడుతుంది . వడదెబ్బ తగిలినప్పుడు - 10 బిళ్ళలను ఒక కప్ నీటిలో కరిగించి - అరగంటకు ఒక స్పూన్  పట్టించవలెను . (ఈ మందు అన్ని హోమియో షాప్ లలోను దొరుకుతుంది . కాబట్టి దగ్గర ఉంచుకొనవచ్చు.)
నివారణ కొరకు - రోజు ఉదయం లేదా ఎండ లోనికి వెళ్ళే ముందు ఒక బిళ్ళను వేసుకుంటే - ఆరోజుకు ఎండదెబ్బ తగలకుండా నివారించవచ్చు . ఇది ఖచ్చితమైన ఔషధం . 

ఇతర జాగ్రత్తలు / మందులు : 

1. వడదెబ్బ తగిలితే వెంటనే ఉల్లిపాయను అడ్డం గ కోసి - కణతలు , గుండె , నుదురు పై రుద్దుతూ వుండాలి . 

2. జ్వరము గ వుంటే అర గ్లాస్ వెచ్చటి నీటిలో ఒక స్పూన్ నెయ్యి ని వేసి తాగి , వెచ్చగా షాల్ కప్పుకుని పడుకుంటే వెంటనే చమటలు పట్టి వడదెబ్బ నెమ్మదిస్తుంది . 

3. చింతపండు రసం తీసి + పంచదార కలిపి తాగిస్తే వడదెబ్బ వలన కలిగిన ఒంటి నొప్పులు , నీరసం తగ్గుతాయి . 

4. నిమ్మరసం లో ఉప్పు + పంచదార కలిపి తీసుకోవలెను . 

ఎండాకాలం లో తీసుకోవలసిన చలువ పదార్దములు :

1. బర్లి గింజల్లో నీరు పోసి ఉడకబెట్టి బార్లి నీరు తాగి గింజలు తినవచ్చును 

2. సబ్జా గింజలను నాన బెట్టి అన్ని రకముల జ్యూస్ లలో వేసుకుని తగవచ్చును 

3. ఎండు ఖర్జూర , కిస్మిస్ , ఎండు ద్రాక్ష లను నీటిలో నాన బెట్టి కొంచెం పటికబెల్లం కలిపి - ఆ నీరు వడపోసి చిన్న పిల్లలకు కూడా పట్టించవచ్చును . నీరు తీసాక నానిన ఖర్జూర పండ్లను తినడం వలన మల బద్దకము కలగదు . 

4. పలుచని మజ్జిగలో అల్లం , కొత్తిమీర ,కరివేపాకు , కొంచెం ఉప్పు , 10 చుక్కల నిమ్మరసం వేసుకుని తాగుతూ వుండటం వలన అసిడిటీ లాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు 

5. పచ్చి ఉల్లిపాయను కూరలలోను విడిగాను తీసుకుని తినవచ్చును 

6. ధనియాల కషాయం లేదా ధనియాల చారు చేసుకుని తినడం వలన అమితమైన చలువ చేస్తుంది . 

విపరీతమైన ఎండలో పోవునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

1. ఖచ్చితం గ - తల చుట్టూ మందం గా గుడ్డ ను కట్టుకుని ఎండలోకి వెళ్ళవలెను . ముఖ్యముగా చెవిలోనికి వడగాలి వెళ్ళకూడదు . మెదడుకు , నుదిటికి  వేడి తగలకూడదు . అలాగే గుండెకు వేడి గాలి తగలకుండా జాగ్రత్త పడవలెను 

2. దగ్గర ఉల్లిపాయను వుంచుకోగలరు . ఇంకా మంచి నీరు / మజ్జిగ ఖచ్చితం గ వెంట తీసుకుని వెళ్ళవలెను . 

3. ఎండలో ఉన్నంత సేపు తేలికగా అరిగే ఆహారం , పండ్లు , ద్రవ పదార్దములు మాత్రమే తీసుకోవలెను .